జఫర్ఘడ్ జనవరి 21జనగామ జిల్లా జఫర్ ఘడ్ మండలం తమ్మడ పల్లి(జి) గ్రామానికీ చెందిన బిజెపి శక్తి కేంద్ర ఇంచార్జ్ పందిబోయిన రాజు తండ్రి పందిబోయిన నాగయ్య శుక్రవారం అనారోగ్యంతో మరణించాడు.స్థానిక బిజెపి నాయకులు ద్వారా విషయం తెలుసుకున్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.పరామర్శించిన వారిలో జిల్లా సాంస్కృతిక కన్వీనర్ ఎండి వలి పాషా,బిజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పుండ్ర నవీన్ రెడ్డి,దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి రడపాక ప్రదీప్,జఫర్ఘడ్ మండల సోషల్ మీడియా కన్వీనర్ పులి శ్రావణ్ గౌడ్, మండల ఓబీసీ మోర్చ అద్యక్షులు పంధిబోయిన యాదగిరి,మండల కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు మారెపల్లి రవి,జిల్లా బిజేవైఎం కార్యవర్గ సభ్యులు సూర్య తేజ,బిజేవైఎం మండల ఉపాధ్యక్షులు మిట్టపల్లి భానుచందర్,పెద్ద పెండ్యాల గ్రామ బూత్ అద్యక్షులు చింతల రాజు, రాపర్తి నవీన్ తదితరులు ఉన్నారు.