తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలలో ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే పల్లెదవకణాల ఏర్పాటు పథకం అద్భుతమైనదని. తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం మండల అధ్యక్షుడు చిర్రా శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పత్రికా ప్రకటన విడుదల చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ. అందరికీ వైద్యం అనే నినాదంతో ప్రతి గ్రామానికి పల్లె దావఖాన ఉండాలని సంకల్పించి రాష్ట్ర ప్రభుత్వం. మరియు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముందు చూపుతో పల్లె దవఖానలు ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని. దీనిలో భాగంగా కోదాడ నియోజకవర్గ పరిధిలో మునగాల మండలంలోని ఐదు గ్రామాలకు పల్లెదావకానాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించిన కోదాడ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రతి పేదవాడు కార్మికులు నాణ్యమైన వైద్య దొరక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని. దాని దృష్టిలో ఉంచుకొని . నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లయ్య యాదవ్ గారు ప్రత్యేక చొరవతో పెద్ద మండలం అయిన మునగాలకు ఐదు పల్లె దావఖానాలు మంజూరు చేయించినందున. మండల ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పల్లె దావకాన సేవలను వినియోగించుకోవాలని వారు తెలిపారు.