పసుపు బోర్డు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.15000 ఇవ్వాలి. పసుపు రైతులను మోసం చేసిన బిజెపి ఎంపి
Uncategorizedరౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ విమర్శపసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరలు కల్పిస్తామని ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖం చాటుచేసుకొని పసుపు రైతులను మోసం చేశాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ విమర్శించారు. ఆర్మూర్ లోని మెడికల్ ఏజెన్సీ భవన్ లో తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. అనంతరం శోభన్ మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ ఎంపిగా గెలిచిన అరవింద్ పసుపు రైతులకు తాను ఎన్నికలలో గెలిచిన 5 రోజులలో బోర్డు తెప్పిస్తానని ప్రామిసరి నోట్ పై ఆగ్రిమెంట్ రాసిచ్చాడు. గెలిచిన తరువాత వీరు నేటి వరకు ఆ సమస్యను పట్టించుకోలేదు. పసుపు పండించిన రైతులకు గిట్టుబాటు ధరలేక అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. పసుపు పంట ఖరీదైంది. ఎకరాకు సుమారు రూ. 1.50 లక్షలు ఖర్చవుతుంది. దిగుబడి 15 నుంచి 20 క్వింటాలకు మించడం లేదని అన్నారు. మార్కెట్లో మాత్రం క్వింటాలుకు రూ.5వేలు మాత్రమే రైతులకు లభిస్తున్నది. రైతులకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. దీనివల్ల పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో పసుపు పంట సాగు తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు కొనుగోళ్లకు పసుపు బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా విదేశాలకు ఎగుమతి చేయాలి. పసుపు మద్దతు ధర రూ.15వేలు నిర్ణయించాలని, పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని, స్పైసెస్ బోర్డు రీజనల్ కార్యాలయంతో రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రత్యేక బోర్డు, మద్దతు ధర హామీలను నిలబెట్టుకోవాలి. ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు గిట్టుబాటు ధర పొందడానికి పసుపు పంటలకు ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటుచేసి అదనపు విలువ వచ్చే విధంగా ఉప ఉత్పత్తులను తయారుచేసి అమ్మడం ద్వారా అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి విదేశి మారకద్రవ్యం ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయుటకు ప్రయత్నం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధరప్ప, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు దాసు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు T భూమన్న భూమన్న, జయ ముత్తన్న , గణపతి, లక్ష్మణ్ , దేవేందర్ సింగ్ , రామ్ సింగ్ , గంగారెడ్డి, గణేష్ , దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు