సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ఈదులవాగు తండాలో అక్కడ ఉన్న బండను కొట్టి బ్రతికే వడ్డెర, లంబడి కులస్తుల నుండి లాక్కొని అక్రమంగా కార్పోరేట్ వారికి కట్టబెట్టి, పేద వారికి ఉపాధి లేకుండా చేయడంపై అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న గ్రామ ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సుర్యాపేట జిల్లా ఇంచార్జి పిల్లుట్ల శ్రీనివాస్ ని వారికి న్యాయం చేయాలని కొరగా మైనింగ్ ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడతామని, మా పార్టీ అన్ని విధాలా తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు