పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి
Khammam÷ యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక…… ఎస్సై ,కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం దశల వారి పోరాటాలు÷డివైఎఫ్ఐ కార్యదర్శి షేక్ బషీరుద్దీన్,ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ……..ఖమ్మం,జనవరి 5,2022…. రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా నిర్వహిస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ నియామక అభ్యర్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ, అఖిల భారత యువజన సమైక్య ఏఐ వైఫ్ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, నానబాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మంచి కమిటీ భవనంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చింతల రమేష్ అధ్యక్షుడు జరిగిన వాపక్ష యువజన విద్యార్థి సంఘాలు మరియు అభ్యర్థుల సమావేశంలో మీరు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా షేక్ బషీరుద్దీన్ నానబల రామకృష్ణ మాట్లాడుతూ ఎస్సై కానిస్టేబుల్ సమస్యల పరిష్కారం కోసం దశల వారి ఆందోళన చేయునట్లు వారి సందర్భంగా తెలియజేశారు. ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 7న జిల్లా కలెక్టర్ ముందు అభ్యర్థులతో ధర్నా ఉంటుందని, 9వ తేదీన జిల్లాలోని మంత్రుల కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉంటాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులతో పాటుగా, ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పిడిఎస్యు జిల్లా కార్యదర్శి మస్తాన్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు తుడుం ప్రవీణ్, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు భూక్యా ఉపేందర్ నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి కూరపాటి శ్రీను, పిడిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉపేందర్, డివైఎఫ్ఐ నాయకులు రావులపాటి నాగరాజు, శభాష్ రెడ్డి, సునీల్, ఇనపనూరు వర్షిత్, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రేమ్ కుమార్ అభ్యర్థులు నాగరాజు, పవన్, సురేష్ కుమార్లు పాల్గొన్నారు.