ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ పార్టీ
Jayashankar Bhupalpallyమహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం గ్రామపంచాయతీలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తూ కారు గుర్తు ఓటు వేసి డోర్నకల్ ఎమ్మెల్యేగా రెడ్యానాయక్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మరో సారి కేసీఆర్ సీఎం కావాలని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రతి పల్లెల్లో రూపురేఖలు మార్చారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క సామాన్యునికి అందే విధంగా శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో మన గ్రామాలు ఇంకా అభివృద్ధిలోకి నడుచుకోవాలంటే మల్లి తెలంగాణ రావాలి. కేసీఆర్ సీఎం అవ్వాలి. రెడ్యా నాయక్ ను డోర్నకల్ నియోజకవర్గం లో మళ్లీ ఎమ్మెల్యే గెలిపించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, రాంపురం గ్రామ ఎంపీటీసీ కొమ్ము నరేష్,మరిపెడ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొమ్ము చంద్రశేఖర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బందు పరశురాములు, గ్రామ సోషల్ మీడియా గోనె మహేష్, యూత్ నాయకులు రాంపల్లి రంజిత్, గంగరబోయిన రమేష్, చింతపల్లి లింగన్న,బిఆర్ఎస్ గ్రామ పార్టీ నాయకులు దోమల సత్తయ్య,రాంపల్లి చిన్న వెంకన్న, కొమ్ము అవిలయ్య, దిడ్డి చంద్రశేఖర్, ఆలువాల లక్ష్మయ్య,జటంగి రాములు, ఏల్ది వెంకన్న,పొడుపుగంటి మహేష్,ఏడ్ల నరసయ్య, వాసం సంజీవ,మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.