మండల తహసిల్దార్ అశోక్ మండలంలోని ముంపు ప్రాంతాలను సందర్శిస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారణ చర్యలను ముమ్మరం చేశారు ముంపు ప్రాంతాలను సందర్శించడంతోపాటు నీటి ప్రవాహం వల్ల మూసుకుపోయే రహదారులను సైతం దగ్గరుండి సమీక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిలో ఇటువంటి సాహస పూరిత చర్యలకు పాల్పడవద్దని మండల ప్రజలను వారు కోరారు మండల యంత్రాంగం సహాయ చర్యలకు సిద్ధం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వర్ష బాధితులకు సహాయ చర్యల్లో భాగంగా నీటిపై ప్రయాణించే తెప్పలను సిద్ధంగా ఉంచినట్లు తహసిల్దార్ అశోక్ తెలిపారు ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరిగితే సహాయం కోసం తనను నేరుగా సంప్రదించవచ్చని ప్రజలను కోరారు.