మునగాల ప్రతినిధి (తెలుగు గళం):-సెప్టెంబర్ 9 మునగాల మండల కేంద్రంలోని స్థానిక శాఖ గ్రంథాలయంలో ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ ఎం.వి.రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవడం జరిగింది ముందుగా కాళోజి నారాయణరావు జయంతిలో భాగంగా వారి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులు అర్పించారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటితరం సంస్కృతి సాంస్కృతిక వారసత్వం గురించి తెలుసుకోని కాపాడు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు, కందిబండ సత్యనారాయణ టిఆర్ఎస్ జిల్లా నాయకులు, పందిరి నాగిరెడ్డి ఎంఎస్ విద్యాసంస్థల చైర్మన్ కోదాడ, ఉప్పుల యుగేందర్ రెడ్డి , ఉడుం కృష్ణ , అరవపల్లి శంకర్ రిటైర్డ్ కెఆర్ఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్, గంధం సైదులు సామాజిక కార్యకర్త, దేవ బత్తిని లలిత దేవిగ్రంధాలయాధికారి, చిల్లంచర్ల ప్రభాకర్ సిపిఐ నాయకులు, పాఠకులు ఈట పవన్, భాస్కర్ ఉపేందర్, సాయికుమార్ ,మోహన్, రవి, తదితరులు పాల్గొన్నారు.