ప్రజా ప్రతినిధులారా! ప్రభుత్వ అధికారులారా!
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే తప్ప ప్రజల సమస్యలను ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని జక్కలొద్ది గ్రామ సమీపంలోని రామ సురేందర్ నగర్ గ్రామ అధ్యక్షులు రామ సందీప్ ఉపాధ్యక్షులు గజ్జ చందు ఆరోపించారు.వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం 43 డివిజన్ జక్కలొద్ది గ్రామ శివారులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెట్లు విరిగి కరెంట్ పోల్స్ వైర్లు మీద పడ్డాయని, వైర్లు రోడ్ మీద పడి రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు.రెండు రోజులుగా ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని 4 సంవత్సరాల నుండి జక్కలొద్ది గ్రామం శివారులో గుడిసెలు వేసుకొని ప్రజలు నివాసం ఉంటున్నారు.ప్రజల పరిస్థితి చుస్తే ఆగమ్య గోచరంగా మారిందని కరెంట్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.రోడ్లు సరిగ్గా లేక తినడానికి తిండి లేక నానా కష్టాలు పడుతున్నా ప్రభుత్వం అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళనలు చెందుతున్నారని అన్నారు.
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల వరదలు పోటెత్తుతున్న సందర్భంగా ప్రభుత్వ అధికారులు పేరుకే టోల్ ఫ్రీ నెంబర్ నామ మాత్రంగా ఏర్పాటు చేశారని దాంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.మున్సిపల్,కలెక్టర్,విద్యుత్ ఆఫీసులకు ఫోన్ చేసి చెబుతె పట్టించుకోవడం లేదని మేము కాదంటే మేము కాదని దాట వేస్తున్నారని మండి పడ్డారు.తక్షణమే సమస్యలను పరిష్కరించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.లేకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.గ్రామ కమిటీ సభ్యులు బెజ్జెల కోటేశ్వర్,చాగంటి ఉపేందర్,దైద పూర్ణ చందర్,మిట్టపల్లి రమేష్,మొగుళ్ళు సునీల్,మైదం వినోద,చిరంజీవి,సునంద,రజిత,సట్ల రజిత తదితరులు పాల్గొన్నారు.