ప్రజా సంఘాల నాయకుల అరెస్టులను ఖండించిన కొడాలి శ్రీనివాసన్

కాంగ్రెస్ సిపిఎం సిపిఐ టిడిపి సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మరియు ప్రజా సంఘాల నాయకుల అరెస్టులను ఖండించిన మహబూబాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్

ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మాత్యులు మరియు ఇతర శాఖల మంత్రులు భద్రాచల పట్టణ పర్యటనలో భాగంగా, కాంగ్రెస్ సిపిఎం సిపిఐ తెలుగుదేశం, సిపిఐ ml ప్రజపంథా మరియు ప్రజాసంఘాల నాయకులను జిల్లా పోలీస్ యంత్రాంగం వారు అక్రమ అరెస్టులు చేసి దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ కి తరలించడం దారుణం అని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున నాయకుల అక్రమ అరెస్టులు ఖండిస్తున్నామని,ఇది పూర్తి అప్రజా స్వామికమని ఇలా రాజకీయ పార్టీ నాయకులను అరెస్టులు చేయడం అనేది ఉద్యమ స్ఫూర్తా?.అని కేసిఆర్ ని ప్రశ్నించారు. అదే విధంగా 9 సంవత్సరాలుగా భద్రాచల పట్టణానికి ఏనాడు రాని మంత్రి భద్రాచల పట్టణానికి ఎన్నికల వేళ వచ్చిన సందర్భంలో వినతిపత్రాలు ఇవ్వడానికి కూడా రాజకీయ పార్టీలకు అర్హత లేదా అని ప్రశ్నిస్తూ వెంటనే వీరిని విడుదల చేయాలని కొడాలి శ్రీనివాసన్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *