hyd
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా డబుల్ బెడ్ రూమ్ సమస్యలపై వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వెళ్ళిన బండ్లగూడ తహసీల్దార్ కుర్చీ ఖాళీగా ఉంది గత కొన్ని రోజులుగా లేరు అని తెలుస్తుంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి కృష్ణానాయక్ మాట్లాడుతూ…
గత ఆరు నెలల క్రితం వచ్చిన MRO చంద్రకళ గారు ప్రమోషన్ లో భాగంగా RDO అయి వెళ్లిపొగ ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి అధికారులు ఎవరు కేటాయింపులు తెలియని పరిస్థితి నెలకొంది. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు గురించి ప్రభుత్వం ఈ నెల 15 తేదీన పంపిణీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి కానీ పాత నగరంలో బండ్లగూడ మండలం లోని ఎమ్మార్వో లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ ఎలా చేస్తారు అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు సక్రమంగా జరగాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇన్ వార్డులో ఇచ్చే పరిస్థితిలో బండ్లగూడ మండలం ఉందని ఇప్పటికైనా వెంటనే ఎమ్మార్వో ఎవరు అధికారంగా ప్రకటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ స్థానికులకు కేటాయించాలని సిపిఎం పార్టీగా కోరడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ నాయకులు శ్రీను లక్ష్మి రుక్సానా బేగం భాను బేగం లలిత శారద అరుణ కిరణ్ సూర్య భరత్ తదితరులు పాల్గొన్నారు