ప్రతిపక్ష పార్టీ ఎం.పిలను సస్పెండ్ చేయడం దుర్మార్గం
Uncategorizedగళం న్యూస్ వరంగల్: ఏఐసిసి మరియు టిపిసిసి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను అకారణంగా పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు వరంగల్ పశ్చిమ ఏం.ఎల్.ఏ. & జిల్లా అద్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులూ మాట్లాడుతూ.. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలనిడిమాండ్ చేసినందుకు పార్లమెంట్ ఉభయ సభలో ఉభయ సభల్లో ఎంపిలపై సస్పెన్షన్ దారుణమని. డిసెంబర్ 13న లోక్ సభలోకి చొరబడ్డ వారికి పాస్ లు ఇచ్చిన బిజేపి ఏం.పి ప్రతాప్ సింహపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హోం శాఖా మంత్రి ప్రకటనను కోరిన ఇండియా కూటమి మరియు ప్రతిపక్ష పార్టీ ఏం.పిలను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా పార్లమెంట్ లో మోడీ సర్కార్ కీలక చట్టాలను ఎలాంటి చర్చా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆమోదించుకోవచ్చని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేసింది. ఏం.పి.లను సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం ప్రజా స్వామిక సంప్రదాయాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రబుత్వ నియంతృత్వం పరాకాష్టకు చేరింది. పార్లమెంట్ ను బిజేపి కేంద్ర కార్యాలయంగా భావిస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని మర్డర్ అఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా నడుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, సయ్యద్ విజయశ్రీ రజాలి, టిపిసిసి కార్యదర్శి సయ్యద్ రజాలి, మైనారిటీ సెల్ జిల్లా అద్యక్షులు మిర్జా అజీజుల్లా బేగ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు బంక సరళ, టిపిసిసి ఒబిసి డిపార్టుమెంటు కార్యదర్శి పులి రాజు, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం అధ్యక్షుడు పల్లకొండ సతీష్, అద్యక్షుడు లడె రమేష్, నల్ల మహాత్మా, టిపిసిసి రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి రహీమున్నిసా బేగం, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సుంచు అశోక్, నాయకులు బండారి జనార్ధన్ గౌడ్, బొంత సారంగం, మొహమ్మద్ సమద్, తాళ్ళపల్లి మేరీ, ఎస్. కుమార్ యాదవ్, గాండ్ల స్రవంతి, ఎదులపురం లక్షం, శివాజీ, సంగీత్ , ఓరుగంటి పూర్ణ, ఎస్. రవి, సాయిరామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు