జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని ఓబులపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య గారి ఆదేశానుసారం గ్రామ శాఖ అధ్యక్షుడు అలుగోజ్ అనీల్ గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ & క్లస్టర్ ఇంచార్జ్ గుజ్జరి రాజు గారు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ… గౌరవ రాజన్న గారి ఆదేశానుసారం నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ప్రతీ 200 మంది ఓటర్లకు ముగ్గురు చొప్పున ఇంచార్జ్ లను నియమించడం జరుగుతుందని దానిలో భాగంగా ఈ రోజు ఒబులపూర్ గ్రామంలో కూడ ఇంచార్జ్ లను నియమిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఈ ముగ్గురిలో ఒక సీనియర్ నాయకుడు, ఒక మహిళా నాయకురాలు, ఒక యువకుడు ఉండేలా నియమించడం జరిగందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీమొగులగాని చంద్రయ్య (కుమార్), క్లస్టర్ కమిటీ సభ్యులు రాపర్తి రాజ్ కుమార్, కుక్కల సారయ్య, కొడారి యాకయ్య, మండల పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగబ్బెట కొమురయ్య, వార్డ్ సభ్యులు మొగులగాని లక్ష్మయ్య, గబ్బెట దేవదాస్, జనార్దన్ గార్లు పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.