ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి సహాయక బృందాలు పంపించాలి
అధికారులు గ్రామాలలోని ప్రజాప్రతినిధులు సమన్వయంతో చెరువులు, వాగుల, మరియు ప్రాజెక్టుల నీటి నిలువల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
ప్రజలందరూ అధిక వర్షాల మూలాన అప్రమత్తంగా ఉండాలి
అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవ్వరూ బయటకు రావద్దు
సహాయక చర్యల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలి
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు మండలం లోని జంగాలపల్లి జాతీయ రహదారి పై ప్రవహిస్తున్న నీరు నిలిచిపోయిన రాక పోకలు పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
అదే విధంగా మదన పల్లి,
బండారు పల్లి, సింగర కుంటపల్లి,గ్రామాల్లో వరుద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
నిన్న మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ములు భారీ వర్షాలు కురువడం తో వరుద నీరు ఇండల్లోకి చేరడం రోడ్ల పై నుండి వరుద నీరు ప్రవహిస్తుండటంతో రాక పోకలు నిలువడం తో పాటు కొన్ని గ్రామాల్లో ఇండ్లు నేలమట్టం అయి ఇండ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పరిస్థితి ఉందని
ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే నది తీరా గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను నదులలోకి,వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని
భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ.. ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉంటుదని కాబట్టి రోడ్డు రవాణా,విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా పోలీస్ విధ్యుత్, రెవెన్యూ, ఆర్ & బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్,మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ములుగు పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్ష పతి,కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నునేటి శ్యామ్
బీసీ సెల్ మండల అధ్యక్షులు పౌడాల ఓం ప్రకాష్
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు
మాజీ సర్పంచ్ అశోక్
బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు గుండ బోయిన రమేష్ సహకార సంఘం డైరెక్టర్
తదితరులు ఉన్నారు