బర్రెలక్క (శిరీష) తమ్ముడిపై దాడిని ఖండించండి వారి కుటుంబానికి రక్షణ కల్పించాలి : తమ్మినేని

కొల్లాపూర్ శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన బర్రెలక్క (అలియాస్ శిరీష) ప్రచారం ముగించుకుని వెళ్తున్న సమయంలో తన తమ్ముడిపై గుర్తు తెలియని వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడ్డారు. నామినేషన్ వేసినప్పటి నుండి వారి కుటుంబ సభ్యులను ప్రలోభాలకు, వేదింపులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒకవైపు మహిళలకు 33శాతం రిజర్వేషన్ అంటూనే, నిరుపేద దళిత అమ్మాయి రాజకీయంగా ముందుకొస్తే ఇలాంటి ఘటనలకు పాల్పడడం దారుణం. గతంలో నిరుద్యోగ అంశంపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు శిరీషపై కేసు పెట్టి కోర్టుల చుట్టూ ఇప్పటికీ తిప్పుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో పోటీచేసే హక్కును కాలరాయడం సరైందికాదు. ఈ ఘటనలను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, శిరీష కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరుతున్నది. అంటూ తమ్మినేని ప్రకటన లో తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *