బషీర్ బాగ్ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలి
Bhadradri Kothagudemగళం న్యూస్ భద్రాద్రి జిల్లా *
**సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు*—————————————-2000 సంవత్సరం ఆగస్టు 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బషీర్బాగ్ వద్ద జరిగిన పోలీస్ కాల్పుల్లో వీర మరణం పొందిన అమరవీరులు సత్తెనపల్లి రామకృష్ణ ,విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు ముందుకు తీసుకుపోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బండారు చందర్రావు కార్యాలయంలో బషీర్బాగ్ అమరవీరుల వర్ధంతి శుభాకాంక్షలు జరిగింది. ముందుగా అమరవీరుల చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి తమ ప్రాణాలను సైతం అర్పించిన వీరోచిత పోరాటం విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని అన్నారు. నాడు జరిగిన ఆ పోరాట ఫలితమే నీటి వరకు పాలకులు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి సాహసించలేకపోయారని అన్నారు. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సవరణ చట్టం తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాయ చూస్తుందని, మోటర్లకు మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే విద్యుత్ సవరణ చట్టం వల్ల ప్రజలపై తీవ్రభారాలు మోపబడతాయని దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో ప్రజాపోరాటాలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్తు పోరాటంలో అసువులు బాసిన బషీర్బాగ్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి, కారం పుల్లయ్య పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై వెంకట రామారావు, తదితరులు పాల్గొన్నారు.