వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 08 మంది మైనర్ డ్రైవ్ చేసే వ్యక్తులను గుర్తించి వారిపై జువెనైల్ కోర్టులో చార్జెషీట్స్ ఫైల్ చేయగా అట్టి 08 మంది మైనర్ బాలురను జువెనైల్ మేజిస్ట్రేట్ 01 రోజు బాలల అబ్జర్వేషన్ హోమ్ కి పంపించడం జరిగిందని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.రామకృష్ణ తెలిపారు.ఇకపై వాహనాలు నడిపే మైనరర్లను పట్టుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టు ముందు హాజరు పరచడం జరుగుతుందని తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ బాలలకు వాహనాలు ఇవ్వవద్ద ని అన్నారు.లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన7 మంది వాహనదారులకు వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి 6500/-రూపాయల జరిమాన విధించారనిమరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 21 మందికి 30,600/- రూపాయల జరిమాన విధించారని వెల్లడించారు.