బావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లితే సహించేది లేదు
Jangaonస్వేచ్ఛ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి కలెక్టర్
వినతిపత్రం
జనగామ జిల్లా కేంద్రంలో భావ ప్రకటన స్వచ్ఛతను రక్షించుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద స్వేచ్ఛ జేఏసీ కన్వీనర్ గుమ్మడి రాజుల సాంబయ్య అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి రచయిత సాంబరాజు యాదగిరి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్య సంఘాలు, పార్టీల నాయకులు పాల్గొని రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భావ ప్రకటన స్వచ్ఛను కొనసాగించాలని ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా హిందూ మత ఉన్మాద మూకలు ప్రభుత్వ ఉపాధ్యాయులు నాస్తికులు, హేతువాదులు దళితులు బహుజనలు అనేక రకాల పేర్లతో దాడులు దౌర్జన్యాలు హింసకాండను కొనసాగిస్తున్నారని అలాంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు .చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న మత ఉన్మాదమూకలను కఠినంగా శిక్షించి ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, అనే మూడు విభాగాలను నిరాటకంగా కొనసాగించడానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని వారన్నారు. అనంతరం ఇటీవలి కాలంలో దాడులు దౌర్జన్యాలకు పాల్పడిన వ్యక్తులు సంస్థలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం అందించారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎదునూరి వెంకటరాజం. సిఐటియు జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి కార్యదర్శి బొట్ల శేఖర్ .బహుజన్ సమాజ్ పార్టీ జనగామ జిల్లా నాయకులు నిర్మల రత్నం. జేరిపోతుల కుమార్. జితేందర్. సోమారపు ఉపేందర్. నాస్తిక సమాజం నాయకులు నవీన్. గద్దల సాయి. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు నాయక్. మోకు దెబ్బ జిల్లా నాయకులు కమ్మగాని వెంకన్న .తదితరులు పాల్గొన్నారు.