బిఆర్ఎస్ పార్టీ ఘన విజయోత్సవ ర్యాలీ
అన్నారుగూడెంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గొడ్ల ప్రభాకర్ అఖండ విజయం సాధించిన సందర్భంగా ఆదివారం ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ అత్యధిక మంది ప్రజానీకంతో కోలాట నృత్యాలతో,డప్పు వాయిద్యాలతో ఈ విజయోత్సవ ర్యాలీని చేపట్టారు.తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ మహా ర్యాలీ కనీ విని ఎరగని రీతిలో పరిసర ప్రాంత ప్రజలు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభిమానులు,దొడ్డ శ్రీనివాసరావు అనుచరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన అభినందన సభలో నాయకులు మాట్లాడుతూ మాపై విశ్వాసం ఉంచి గ్రామాభివృద్ధికి అడుగులు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ,మీ నమ్మకాన్ని వమ్మి చేయకుండా గ్రామ అభివృద్ధే ధ్యేయంగా మా శక్తి కి మించి కష్టపడి గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు శక్తికి మించి పాటుపడతామని తెలియజేశారు.కుల మతాలు,పార్టీ విభేదాలు,వర్ణ వివక్షలు లేకుండా కష్టపడి పని చేస్తామని మాట ఇస్తూ మీ అందరి ఆదరాభిమానాలకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సభాముఖంగా వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అన్నారుగూడెం గ్రామం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వీర మోహన్ రెడ్డి,ఆ పార్టీ మండల కార్యదర్శి దుగ్గిదేవర వెంకటలార్, బాలపేట గ్రామపంచాయతీ సర్పంచ్ కోసూరి ధనలక్ష్మి,తల్లాడ గ్రామపంచాయతీ సర్పంచ్ చిన్నబ్బాయి, ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, అన్నారుగూడెం గ్రామ సీనియర్ నాయకులు బొమ్మగాని నాదం, గోవిందు శ్రీనివాసరావు (ట్రాక్టర్),సిపిఎం నాయకులు పులి వెంకట నరసయ్య, టిడిపి నాయకులు దుగ్గినేని వెంకటయ్య, బిజెపి నాయకులు ఆపతి వెంకట రామారావు,పొన్నం కృష్ణయ్య,దొడ్డ చిన్న శ్రీనివాసరావు, మారెళ్ళ దేవేందర్, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, సుంకర రోశయ్య, రాజారావు,పులి నరసింహయ్య,గోన వీరయ్య,షేక్ బాబు, మాగం వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అధికంగా పాల్గొన్నారు.