బీడీ కార్మికులందరికీ ఒకేరకమైన కనీస వేతనం నిర్ణయించాలి
Uncategorizedకేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీడీ కార్మికులందరికీ ఒకేరకమైన వేతనం, కనీస ఫించన్ రూ.10,000/-లు ఇవ్వాలి.
గళం న్యూస్ హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీడీ కార్మికులందరికీ ఒకేరకమైన కనీస వేతనం నిర్ణయించాలని, ఉద్యోగ విరమణ, కనీస ఫించన్ రూ.10,000/-లకు పెంచాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆలిండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) జాతీయ నిర్మాణ వర్క్‌షాప్‌లో కా॥ కె. హేమలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆలిండియా అధ్యక్షులు కా॥ సహదేవన్ అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆలిండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) జాతీయ నిర్మాణ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా సిఐటియు జాతీయ అధ్యక్షురాలు కా|| కె. హేమలత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను అన్ని కాలరాసే విధంగా చేసింది. బీడీ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని అవలంభిస్తుంది. బీడీ కార్మికుల ఉపాధిని కొల్లగొట్టే విధంగా చేస్తుందని అన్నారు.
దేశంలో 60 లక్షల మందికి ఉపాధినిస్తున్న బీడీ కార్మికుల బీడీ పరిశ్రమపై ప్రభుత్వ విధానాల వల్ల సంక్షోభంలోకి నెట్టబడుతుందని అన్నారు. 92% మంది మహిళా కార్మికుల పని చేస్తున్న ఈ రంగంలోని చదువులేని పరిస్థితిని ఆసరాగా చేసుకొని బీడీ కంపెనీకి యజమానులు విపరీతంగా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. కేంద్ర యజమానుల దోపిడీని అరికట్టాలనే రాష్ట్ర ప్రభుత్వాలు యజమానులకు ఎంత పలుకుతున్నారు. కార్మికశాఖ అధికారులు కూడా యాజమానులతో కుమ్మక్కయ్యి మహిళా కార్మికులను దోచుకుంటున్నారు. జిఎస్టి పేరుతో బీడీ కార్మికుల సంక్షేమానికి సెస్‌ను రద్దు చేసి వారి సంక్షేమాన్ని గాలికి వదిలివేశారు. ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.
కార్మికుల పక్షాన పోరాట ఉద్యమం చేయాల్సిన బాధ్యత బీడీ కార్మికుల సంఘాలకు ఉన్నదని అన్నారు. పోరాట ఉద్యమానికి సిఐటియు ముందు ఉంటుదని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు అలిండియా ఉపాధ్యక్షులు ఎకె, పద్మనాభం, బీడీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి దేబశిశ్రాయ్, తెలంగాణ బీడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. గోపాలస్వామి, తెలంగాణ బీడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రమ, బీడీ నాయకులు సూర్జహాన్, ఎంఎ. చౌదరి, పద్మ, బాలమణి పాల్గొన్నారు.