ఈ69న్యూస్ మరిపెడ:- మరిపెడ మండలం బురహాన్ పురం గ్రామ పరిధిలో నుండి వెళుతున్న ఎస్సారెస్పీ కాలువకు గండి పడడం తో పంట పొలాలలోకి కాళేశ్వరం నీరు చేరేంది. పొలాల్లో నీరు బాగా చేరడంతో సాగు ఎలా చేసుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా పైనుండి కాలువలకు నీళ్లు వదిలినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొందని ఎస్ ఆర్ ఎస్ పి కాలువ పనులు నాసిరకంగా చేయడమే వల్లే కాలువకు గండి పడుతుందని గత రెండు సంవత్సరాల నుండి గ్రామ సర్పంచులు గుండెపుడి గ్రామంలో కూడా ఏఈలకు కంప్లైంట్ చేయగా ఇటువంటి మరమతులు చేయలేదు ఎస్సారెస్పీ కాలువకు మించి నీరు రావడం వల్ల డిబిఎం 60 ఎల్ కాలువ నుండి దిగువ బురహాన్ పురం గ్రామం వైపు చిన్న కాల్వ కావడంతో దిగువకు నీరు ఎక్కువ వెళుతుంది రెండవసారి తేగడం మరిపెడ నుండి పాలేరు భక్తురాందాస్ దగ్గరికి కాల్వ మరమ్మతులు సరిగ్గా లేకపోవడం వల్లనే నీరు చేరుకోలేదు కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా పనులు నిర్వహిస్తున్నారు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.