పట్టణ పోలీస్ పరిధిలోని బెల్ట్ షాపులపై గురువారం శుక్రవారం సాయంత్రం పట్టణ ఎస్సై పి చంద్రకుమార్ సారధ్యంలో పోలీసులు మెరుపు దాడి చేసి, మద్యం విక్రయిదారులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ చంద్రకుమార్ మాట్లాడుతూ, పట్టణంలోని కిరాణం దుకాణంలో బెల్ట్ షాపులు నడుపుతూ, మద్యం విక్రయిస్తున్నరనే సమాచారంతో పట్టణ మార్కెట్ ప్రాంతంలోని కొనగంటి రాములమ్మ, యాపల్ ప్రాంతంలోని దండవైణి ఐలయ్య ల అను ఇరువురు దుకాణాలలో సోదాలు నిర్వహించి, ఇరువురి దగ్గర సుమారు లక్షల పదివేల రూపాయల మద్యాన్ని పట్టుకొని,దుకాణాలను సీజ్ చేయడంతో పాటు, మధ్య విక్రయిస్తున్న విక్రయదారులపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.బెల్ట్ షాపుల పేరిట ఎవరైనా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరి శేఖర్, ఏఎస్ఐ కే మల్లేష్,కానిస్టేబుల్ ఎన్ మహేష్, మహిళా కానిస్టేబుల్ ఎస్ పద్మ, మహిళా హోంగార్డు ఉమా తదితరులు పాల్గొన్నారు.