వరద ప్రహంలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు మరణించారు భారీగా ఆస్తి నష్టం అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలంలో పలు గ్రామాలు జల మయ మయ్యాయి మండలంలోనిగొంది గూడెం, కొత్తూరు ఎలకలగూడెం, వేములూరు మనుబోతుల గూడెం, వెంకటాపురం తుమ్మలచెరువు, మామిళ్ళ వాయివెంకటాపురం గ్రామాలలోకి హఠాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వెంకటాపురం గ్రామంలో సుమారు 200 మేకలు ఐదు ఆవులు ఇద్దరు వ్యక్తులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయి మరణించారు.గొందిగూడెం ఇసుక వాగు ప్రవాహం పెరిగి 9 ఆటోలు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా పోగా అందులోని ఏడు ఆటోలని వెలికి తీసినట్టు సమాచారం మిగతా రెండు ఆటోల ఆచూకీ లభ్యం కాలేదు ఎలకలగూడెం గ్రామంలో పాఠశాల మరియు ఇళ్లల్లోకి వాటర్ ప్రవేశించింది. తాటి యాదమ్మ ఏజ్ కల్లూరి నీలమయ్య వరదలు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. మృతదేహాలను స్థానికులు వెలికి తీసి బోరుణ విలపిస్తున్నారు. అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు కానీ ఇంతవరకు ప్రదేశాన్ని సందర్శించలేదని స్థానికులు వాపోతున్నారు.