భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు దానిని కాపాడుకోవడం పౌరులందరి బాధ్యత.
Jayashankar Bhupalpallyస్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం.
స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో సిపిఎం సిపిఐ అమాద్మీ పార్టీ పార్టీలతోపాటు నాస్తిక వాదం ఎమ్మార్పీఎస్ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ సిఐటియు ఏఐటీఈసి డివైఎఫ్ఐ ఏఐవైఎఫ్ అంబేద్కర్ సంఘం రైతు స్వరాజ్య వేదిక ఎమ్మార్పీఎస్ కెవిపిఎస్ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు, సిపిఐ పార్టీ జిల్లా నాయకులు శతుకు ప్రవీణ్ ,అమాద్మీ పార్టీ జిల్లా ఇన్సర్జి నాగుల అరవిందు, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు రాదండి దేవేందర్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు సమ్మయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి, నా స్తిక సమాజం నాయకులు చంద్రమౌళి, మాట్లాడుతూ
ఎవరైనా ఏదైనా చట్ట వ్యతిరేకంగా లేదా చట్ట విరుద్ధంగా మాట్లాడిన ప్రవర్తించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఎవరు ఎవరిపైన దాడులకు పాల్పడరాదు.
తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న మతోన్మాద రాజకీయ శక్తులు ఆడుతున్న రాజకీయ వికృత క్రీడనే నేడు హేతువాదులు, నాస్తికులు, బహుజనులపై జరుగుతున్న ఈ దాడులు. వీటిని ప్రజాస్వామిక వాదులందరం ఖండిస్తున్నాం.
హేతువాదం, నాస్తికత్వం, భౌతిక వాదం చార్వాకులు లోకాయతులు, బుద్ధుడి నుండి మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్ లు అందించిన భారతీయ తాత్విక వారసత్వం.
మానవ మనుగడకు పురోగమనానికి మూలం ప్రశ్నించే తత్వం. ప్రశ్న లేకపోతే మానవ ప్రగతి లేదు. నేడు ఆ ప్రశ్ననే దాడులకు గురవుతున్నది. హత్య చేయబడుతున్నది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యతను గుర్తు ఎరిగిన ప్రజాతంత్ర వాదులం, ప్రజా, పౌర సంస్థల ప్రతినిధులు అందరం రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి కలిసి ఐక్యంగా కృషి చేయనున్నాం. ఇందుకోసం రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా మా కార్యాచరణ ఉంటుంది.
ఎవరు మాట్లాడిన వాటిల్లోనైనా ఏవైనా చట్ట వ్యతిరేకంగా ఉంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానాల తీర్పు ప్రకారం వ్యవహరించాలి. దానికి విరుద్ధంగా దాడులకు పాల్పడడం చట్ట వ్యతిరేకమే కాక రాజ్యాంగ వ్యతిరేకం.
ఎన్నో ఏళ్లుగా నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తున్న బైరి నరేష్ పై, పాటలు పాడుతున్న రేంజర్ల రాజేష్ పై మతోన్మాదం, మనువాదుల దాడులను ఈ సమావేశం ఖండిస్తున్నది.
నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలోని కోటగిరి గ్రామంలో పాఠశాలలో పనిచేస్తున్న దళిత టీచర్ మల్లికార్జున్ ను అత్యంత దారుణంగా అవమానించి, తన నమ్మకాలకు విరుద్ధంగా గుడిలోకి తీసుకెళ్లి బలవంతంగా క్షమాపణలు చెప్పించి బొట్టుపెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి చట్టాన్ని ఉల్లంఘించి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. టీచర్ మల్లికార్జున్ గారిపై జరిగిన దాడిని ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నది.
ప్రొ.సూరేపల్లి సుజాత, POW సంధ్య, సామాజిక కార్యకర్త. దేవి, తదితరులపై బూతులతో మతోన్మాదులు చేస్తున్న దాడులను సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నది.
ఫేస్బుక్లో పోస్టులు పెట్టినందుకు, వాట్సాప్ లో చర్చలు చేసినందుకు అనేక మందిని బెదిరిస్తూ వారి ఇండ్ల దగ్గరకు వెళ్లి దాడులు చేస్తున్నారు. ఈ చర్యలు అన్నిటిని ఈ సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నది.
భావప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు కు విరుద్ధంగా తానే తీర్పులు చెప్పే విధంగా వ్యవహరించి అరాచకశక్తులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేసిన మీడియాపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నది.
మనమంతా కలసికట్టుగా ఈ దాడులకు వ్యతిరేకంగా భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కును కాపాడుకోవడం కోసం ఐక్య కార్యాచరణను చేపట్టడం ఈ సమావేశం ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వి రాజయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దామర కిరణ్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలేం రాజేందర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆతుకూరి శ్రీకాంతు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలేం చిన్న రాజేందర్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ ,,aituc జిల్లా కార్యదర్శి సతీష్ కోటిలింగం, ఎమ్మార్పీఎస్ నాయకులు అంబాల శీను, భారత నాస్తిక సమాజం నాయకులు బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.