GO అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు : ఎమ్మెల్యే గండ్ర. ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి నూతన మండలాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే గారిని సన్మానించిన గోరికొత్తపల్లి ప్రజా ప్రతినిధులు. భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు నాడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి మండలంగా ఉన్న రేగొండ మండలంలో మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేడు ప్రత్యేక మండలంగా ఏర్పాటు GO విడుదల చేయడం పట్ల ఎమ్మెల్యే గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి,రాష్ట్ర BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.