మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ లో గాలి పటాలను ఎగురవేస్తున్న నాయిని రాజేందర్ రెడ్డి
Hanamkondaమకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తనయుడు నాయిని విశాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వరంలో నేడు హన్మకొండ యూనివర్సిటీ అఫ్ ఆర్ట్స్ & సైన్సు కాలేజీ మైదానంలో “కైట్ ఫెస్టివల్” ఏర్పాటు చేసారు. ఈ“కైట్ ఫెస్టివల్” కి ముఖ్య అతిథిగా భద్రాచలం ఎం.ఎల్.ఏ. పోడెం వీరయ్య & హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి నాయకులతో కలిసి గాలి పటాలను ఎగురవేశారు.. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…తెలుగు సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకైన ఈ పర్వదినం మీ ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని కోరుకుంటూ జిల్లా ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ చేసారు. సంక్రాంతి సందడికి మొదటగా స్వాగతం పలికేది గాలిపటాలే పండుగకు పది రోజుల ముందు నుంచే రంగురంగుల పతంగులు నింగిలో దర్శనమిస్తుంటా ఉదయాన్నే గాలిపటాలను ఎగురవేయడం వల్ల సూర్య కిరణాలు మన శరీరాన్ని తాకుతాయని వీటి వల్ల మనకు అనేక వ్యాధులు దరి చేరకుండా ఉంటాయని అన్నారు. మన సంస్కృతి, ఆచారాలు, పండుగల విశిష్టత ను తెలియజెప్పాలనే ఉద్దేశం తోనే ఈ కైట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కైట్ ఫెస్టివల్ లో ఎం.ఎల్.ఏ. పోడెం వీరయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, కార్పోరేటర్ తోట వెంకటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్ట్ దాసరి కృష్ణా రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, వరంగల్ జిల్లా మైనారిటీ సెల్ అద్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, జిల్లా NSUI అద్యక్షుడు పల్లకొండ సతీష్, టిపిసిసి ఒబిసి డిపార్టుమెంటు కో-ఆర్డినేటర్ మోడెమ్ శ్రీధర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొంతి సుదర్శన్ రెడ్డి, నాయిని లక్ష్మా రెడ్డి, మేకల ఉపేందర్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుష్, నాగపురి లలిత, నల్ల సత్యనారాయణ, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొంత సారంగం, ఎర్ర మహేందర్, డివిజన్ అద్యక్షులు ఎస్. కుమార్ యాదవ్, మహమ్మద్ జాఫర్, సింగారపు రవి ప్రసాద్, బంక సతీష్, కొండ నాగరాజు, నాగపురి దయాకర్, పాలడుగుల ఆంజనేయులు, షేక్ అజ్గర్, వల్లపు రమేష్, తక్కలపల్లి మనోహర్, పోగుల సంతోష్, గజపాక రమేష్, కొండుక ప్రదీప్ కుమార్, నాయకులు కే. సాయిరాం యాదవ్, ఫ్రాన్సిస్ రెడ్డి, బండారి మురళి, వెల్దండి రమేష్, కే. కృష్ణ, నాగపురి కరణ్,జి. మహేష్ తదితరులు పాల్గొన్నారు.