మతోన్మాదులను తరికొడదాం
Jangaonబీజేపీ పాలనలో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడబోతుందని బిజెపిని గుట్టును ప్రజలకు తెలియజేయడంకోసం సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2023 మార్చి 17 నుండి 29 వరకు రాష్ట్ర వ్యాపితంగా 33 జిల్లాలను కవర్ చేస్తూ మూడు బృందాలు ”జనచైతన్య యాత్ర” పేరుతో బస్సుయాత్ర జరుగుతుందని, దేశంలో హిందూ మతం ముసుగులో మనువాదం అమలు చేయాలని చూస్తున్న మోడీ, షాల కుట్రలు తెలంగాణపై పనిచేయవని, కమ్యూనిస్టుల రక్తంతో తడిసిన గడ్డపై మనువాదులకు స్థానం లేదని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, ఎండి అబ్బాస్ లు హెచ్చరించారు.
సిపిఎం జన చైతన్య బస్సు యాత్ర జనగామ పట్టణానికి చేరుకోగా పార్టీ జనగామ జిల్లా కమిటీ, జిల్లా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికింది. అనంతరం ప్రెస్టన్ బంగ్లా ప్రాంగణంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, ఎండి. అబ్బాస్ లు పాల్గొని మాట్లాడుతూ దేశంలో బీజేపీ అభివృద్ధి పేరుతో దోపిడీ, మోసాలు చేస్తుందని అన్నారు. అనాగరికమైన కులవ్యవస్థను కావాలంటుందని ఇంకా ఈ ఆధునిక కాలంలో కూడా ఇటువంటి అనాగరిక ఆలోచనలు అవసరమా అని తెలిపారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని పేదలు 70కోట్ల కుటుంబాలు ఉన్నాయని అన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వలేని మోడీకి 470కోట్ల ఇల్లు అవసరమా అని ప్రశ్నించారు. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలును కారుచౌకుగా కార్పొరేట్లకు కట్టబెడుతుంది. ప్రభుత్వ ఆస్తులు కోల్పోతే ఆ నష్టం ఎవరికీ? ప్రజలకే కదా అని అన్నారు. అదానీ ఆస్థి మోడీ ప్రధాని కాకముందు 50 వేల కోట్లు, ఇవాళ అది 11లక్షల కోట్ల రూపాయలైంది ఎలా అని తెలిపారు. చేనేత బోర్డును రద్దుచేసి చేనేత కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత మోడిదని తెలిపారు. సామాన్య, మధ్య తరగతి వ్యాపారస్తులను దెబ్బ తీసాడన్నారు.దేశ ప్రజల కష్టార్జితమైన విమాన, రైల్వే, బొగ్గుగనులు, ఉక్కుఫ్యాక్టరిలు బ్యాంక్ లు, ఎల్ఐసి, జాతీయ రహదారులు, iఅన్ని అమ్మే హక్కు మోడీకి ఎవరు ఇచ్చారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఖర్చులను రెట్టింపు చేశారని విమర్శించారు. మహిళలపై దాడులు, హత్యలు, హత్యాచారాలు పెరుగుతున్నాయి, దోషులకు మోడీ ప్రభుత్వం అండగా ఉంట్టుందని అన్నారు. దేశంలో ఆకలి చావులకు కారణం మోడీ తప్ప ఇంకొకరు కాదని బీజేపీ మోడీది లూటీ ప్రభుత్వం అన్నారు. అన్నం పెట్టె రైతన్నలను జైళ్లలో పెడుతున్నారు, మోడీని ప్రశ్నిస్తే వారిని అణిచివేస్తున్నారన్నారు. అచ్చేదిన్ అనేవాలా హై అని మోపీ చెప్పి 9 ఏండ్లు గడిచాయి, ఆ మంచి రోజులు మోడీ మిత్రులైన అదానీ, అంబానీలకే వచ్చాయని విమర్శించారు. ఆస్తుల్ని అమ్ముతున్నారు, ధరలు పెంచుతారు ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చుతున్నారు ఇదే బీజేపీ విధంగా అని అన్నారు. యువతకు సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఈ 8 ఏండ్లల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. దేశంలో కులం లేదు, మతం లేదు పుట్టిన అందరం సమానమే, అలాగె ధనిక, పేద తేడాలేకుండా అందరం కలసి మెలసి ఉండాలన్నదే కమ్యూనిస్టు సిద్ధాంతం అని తెలిపారు. అందుకే బీజేపీని వ్యతిరేకించే లౌకిక శక్తులన్ని ఏకం కావాల్సిన సమయం వచ్చేసింది, లేకపోతే భారత్ కు భవిష్యత్ ఉండదన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తుందంటానికి రావుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే ఒక నిదర్శనం అన్నారు. మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలను ఎండగట్టడానికి, రాష్ట్ర వ్యాపితంగా వామపక్షాల ప్రభావాన్ని ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకుపోవడానికి ఉపయోగపడుతున్న ఈ యాత్రకు ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్ధతివ్వాలని విజ్ఞప్తి చేశారు. 2023 మార్చ్ 29 హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఉంట్టుందని ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు టి. స్కైలాబ్ బాబు, p.ఆశయ్య, ఎం. ఆడవయ్య, జయలక్ష్మ, జగదీశ్, పార్టీ జనగామ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వేంకట్రాజం, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, రాపర్తి రాజు, బోట్ల శేఖర్, సింగారపు రమేష్, గొల్లపల్లి బాపు రెడ్డి, రాపర్తి సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, బి.చందు నాయక్, పి. ఉపేందర్, బోడ నరేందర్, ఎ. కుమార్, సిఎచ్. సోమన్స, పార్టీ సీనియర్ నాయకులు బోట్ల శ్రీనివాస్, ఎండి. దస్తగిర్, మండల కార్యదర్శులు జి. మహేందర్, బి. కరుణాకర్, నాయకులు బిట్ల గణేష్, బి వెంకటమల్లయ్య, ధర్మబిక్షం, దడిగె సందీప్, డి. నాగరాజు, టి దేవదానం, k.లింగం, p.లలిత, సిఎచ్ రజిత బాలు, బ్లెస్సింగ్టన్, em.బీరయ్య, మీట్యా నాయక్, ఎ. సురేష్, జి. గణేష్. కె. కళ్యాణ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.