మన ఊరు మన బడి కార్యక్రమంలో-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Jangaonమన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం వావిలాల గ్రామ ప్రాథమిక పాఠశాల లో 25 లక్షల 9 వేల తో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పలు మరమ్మతులు, విద్యుదీకరణ, మంచినీరు, ప్రహరీ గోడ, వంట గది, పాఠశాల లో మౌలిక వసతులు ఏర్పాటు చేశారు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్
రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల కోట్లతో మూడు విడతలుగా ప్రభుత్వ పాఠశాల లను ఆధునీకరణ చేస్తున్నాం
సీఎం కెసిఆర్ ప్రభుత్వ పాఠశాల లను ప్రైవేట్ స్కూల్స్ కంటే గొప్పగా తీర్చిదిద్దుతున్నారు
సీఎం మంచి సీఎం, కానీ, కేంద్ర ప్రభుత్వమే ప్రజలకు కీడు చేస్తున్నది
నిత్యావసర ధరలు పెంచింది
పెట్రోల్, డీజిల్ ధరలను, చివరకు గ్యాస్ ధరలను కూడా పెంచింది
కెసిఆర్ మేలు చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తున్నది
ఇంకా సిగ్గు లేకుండా మోడీ, బీజేపీ గొప్పలు చెబుతున్నారు
ప్రజలు ఏమి జరుగుతున్నదో తెలుసు కోవాలి
ఇక రాష్ట్రాన్ని సీఎం కెసిఆర్ గారి ప్రభుత్వం బంగారు తెలంగాణ గా తీర్చిదిద్దుతున్నది
తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్ కే పంపించాలి
ప్రభుత్వ స్కూల్ లో ఆంగ్ల మాధ్యమం లో చదువులు చెబుతున్నారు
నిష్ణాతులు అయిన ఉపాధ్యాయులు ఉన్నారు
సకల సదుపాయాలు కల్పిస్తున్నాం
తల్లి దండ్రులు తమ పిల్లలకు ప్రతి రోజు కొంత సమయం ఇవ్వాలి
పిల్లల ముందు మద్యం, సిగరెట్, టీవీ చూడటం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి
పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండి
పిల్లలు ఏమి చదువుతున్నారు? ఏమి చేస్తున్నారు? వాళ్ళ మీద నిఘా పెట్టండి
మంచి భవిష్యత్తు గల పిల్లలని తయారు చేయడం మన బాధ్యత
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, డి ఈ ఓ రాము
అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.