*మరిపెడలోఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు*•భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు ఘనంగా గులాబీ జెండా పండుగ.ఈ69న్యూస్ డోర్నకల్:-మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ 22 వసంతాల పండుగ వేడుకలను స్థానిక లక్ష్మారెడ్డి పంక్షన్ హాలులో మహబూబాద్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో డోర్నకల్ ఎమ్మేల్యే రెడ్యానాయక్ అధ్యక్షత వహిస్తూ ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు, ఇతర గ్రామాల్లో నాయకులు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా పై వచ్చిన ఆరోపణలు నిజమైతే రాజీనామా చేస్తానని అన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ డోర్నకల్ నియోజకవర్గం ప్లీనరీ తీర్మానాలు చేశారు.నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలి అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వెంటనే బీసీ కుల గణన చేపట్టాలి. అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులకు కేంద్రం కోత విధించింది. అలాగే ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అన్నారు. తెలంగాణకు మణిహారం మన సింగరేణిని ప్రైవేట్ పరం చేయవద్దు అన్నారు. కార్మికుల పొట్ట కొట్టవద్దు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలి అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన అన్ని విభజన హామీలను వెంటనే నెరవేర్చాలి అన్నారు.రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి అన్నారు. మన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అంటూ జల్ జీవన్ మిషన్ ను అమలు చేస్తున్నదని అన్నారు. నీతి ఆయోగ్ మిషన్ భగీరథ పథకానికి 19వేల కోట్ల రూపాయలను తెలంగాణకు ఇవ్వాలని చెప్పినా, ఇవ్వడం లేదు. వెంటనే మిషన్ భగీరథకు నిధులు విడుదల చేయాలి అని అన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినందుకు బిజెపి ని నిలదీయాలి అన్నారు.ఈ కార్యక్రమములో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, బిఆర్ఎస్యువజన యువ నాయకులు రవిచంద్ర, మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,ఎంపిపి అరుణ రాంబాబు,జెడ్పిటీసీ శారధ రవిందర్,మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర రవి,కౌన్సిలర్లు,ఎంపిటిసిలు,సర్పంచ్ లు,మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.