మరిపెడ పట్టణంలోని నూతన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గరలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న వారిని మట్టి తోలుతున్న ట్రాక్టర్ అతివేగంగా ఢీ కొట్టడంతో బైక్ పై ఉన్న మహిళ బానోత్ శైలజ అక్కడికక్కడే మృతి చెందింది. కాగా భర్త వెంకటేష్, కుమారుడు కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు గుండెపుడి గ్రామ శివారు తండాకు చెందిన మహిళగా తెలిపారు. వీరు పండగపూట తన తల్లి గారి ఇంటి వద్దకు వచ్చి పండుగ అనంతరం వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. కాగా తల్లి మృతితో ఆ కుమారుడు అనాధ గా మారాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.