మహాత్మా జ్యోతిభా ఫూలేను స్ఫూర్తిగా తీసుకోని బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలు ఏకమై బహుజన రాజ్యాధికారం సాధించాలి
Uncategorized- బీసీలకు 52శాతం విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు సాదిoచి తీరుతాo
- బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న
మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:-
మహాత్మా జ్యోతి భా ఫూలేను స్పూర్తిగా తీసుకోని బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలు ఏకమై తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించినపుడే ఆమహనీయుని 197 వ జయంతికి ఘణమైన నివాళులు అర్పించినట్లు అవుతుంది అని అన్నారు.బీసీలకు 52 శాతం విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాలలో జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు సాదిస్తాం అని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న అన్నారు.ఈ రోజు బహుజన సిద్ధాంతం కర్త మహాత్మా జ్యోతి భా ఫూలే 197వ, జయoతి సందర్బంగా సీరోల్ మండలంలో ఉన్న అందనాలపాడు గ్రామoలో బీఎస్పీ పార్టీ నాయకులు కనకం రామకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షలు తగరం నాగన్న మహాత్మా జ్యోతిభా ఫూలే చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న మాట్లాడుతూ దేశంలోబిసిల జనాభా ,52 శాతం,రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతం ఉన్న జనాభాకు కేవలం 27 శాతం విద్యా ఉద్యోగం రిజర్వేషన్ లు మాత్రమే అమలు చేయడం కేంద్రంలోని బీజేపీ పార్టీకి సిగ్గుచేటు అని అన్నారు .ప్రస్తుతం తెలంగాణ లో ప్రజా పాలన జరగడం లేదని కేవలం రెడ్డిలు పాలన మాత్రమే జరుగుతుంది అని అన్నారు.మహాత్మా జ్యోతి భా ఫూలే స్ఫూర్తితో బీసీలు ఐక్యమై జనాభా దామాషా ప్రకారం బీసీలకు 52 శాతం విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు సాధించి తీరాలని ఆకాక్షించారు . భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ సబ్బండ వర్గాల అభ్యున్నతికి ఆహర్నిశలు కృషిచేసి రాజ్యాంగం రాశారు అని అన్నారు .కేంద్ర ప్రభుత్వo రాజ్యాంగం మార్చలనే కుట్రలు చేయడం హేయమైన చర్య అని అన్నారు . బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాజీ ముఖ్య మంత్రి బెహన్ కుమారి మాయావతి,రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ ఆధ్వర్యంలో బహుజనలకు రాజ్యాధికారం సాధించి రాజ్యాంగం ను రక్షించుకొని చిత్త శుద్ధితో అమలు చేస్తాము అని అన్నారు
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, వేణు, లోకేష్,అశోక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.