మహాత్మ జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్బంగా శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి BRS నాయకుడు నాగేష్ ముదిరాజ్ నాగేష్ ముదిరాజ్మాట్లాడుతూ . దేశంలో ప్రజలను మోసగిస్తూ దోపిడీని కొనసాగించడానికి సృష్టించిందే సంస్కృతికరణ, సనాతన ధర్మం అని ఆయన ఆనాడే చాటి చెప్పారు. దాని నుంచి బయట పడాలంటే దేశంలోని మహిళలు చదువుకున్నప్పుడే మూఢాచారాల నుంచి బయటపడతారని వారి భార్యకి చదువు చెప్పించి ఉపాధ్యాయులగా తయారు చేసి మహిళలకు చదువు చెప్పిన గొప్ప మేధావి అన్నారు. ఆయన వేసిన అడుగు జాడల్లో భార్య సావిత్రిబాయి పూలే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా ఎదిగి మహిళలకు చదువు చెప్పించడంతో నేడు దేశంలో ఉన్న ప్రతి మహిళ చదువుకుని అన్ని రంగాల్లో ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి కారకులయ్యారు. అలాంటి మేధావులను నేడు రాజకీయ నాయకులు విస్మరించడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 340 బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను బీసీలకు దక్కలని నాగేష్ ముదిరాజ్ కోరారు.