లింగాల ఘనపురంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు తెలుగు గళం జనగామ భూమి కోసం,భుక్తి కోసం,దోపిడీ పీడన నుంచి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అన్నారు.వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహనికి పూలమాల వేసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘనంగా నివాలులర్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..తెలంగాణ బహుజన చైతన్యానికి,మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని.ఐలమ్మ చూపిన తెగువ సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ,స్ఫూర్తినిచ్చిందని,సాయుధ ఉధ్యమ సమయంలో ఐలమ్మ చూపిన ధైర్య సాహసాలు ఎనలేనివని గుర్తు చేశారు.తెలంగాణ పౌరుషాన్ని త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు.సబ్బండ వర్గాల సంక్షేమం,మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.జోహార్ చాకలి ఐలమ్మ అంటూ ఎమ్మెల్యే నినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.