మానవతా దృక్పథముతో గ్రేటర్ నల్గొండ ఎన్నారై ఫోరం ఎన్నారై రణబోతూ శ్రీనివాస్ వరద బాధితులకు సహాయం
Suryapetతొగరాయి, కూచిపూడి గ్రామాల వరద బాధితులకు సహాయం
200 వందల మందికి వరద సహాయ కీట్ల పంపిణీ
కోదాడ,గళం న్యూస్ : గ్రేటర్ నల్గొండ ఎన్నారై (NRI) ఫోరం సహకారంతో మరియు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యపేట వారి అసోసియేషన్ తో ఎన్నారై రణబోతు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కోదాడ మండల లో తోగారాయి , కూచిపూడి గ్రామం లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగి భారీ వరదకు వరదల్లో గృహాములో ఉన్న అన్ని నిత్య అవసర సరుకులు అన్ని తడిసి కొట్టుకుపోయిన, మునిగిపోయిన గృహాల , బాధితులకు వరద సహాయం అందించటం జరిగినది, ప్రతీ భాదితుడికి 1500 రూపాయల విలువైన , 10 కేజీల రైస్, రెండు దుప్పట్లు,కేజీ ఆయిల్ పాకెట్, ఒక శారీ,కందిపప్పు, 2 సబ్బులు, 2బిస్కెట్ ప్యాకెట్ లు ,ఒక తువాలు పాకెట్ , కేజీ ఉల్లిగడ్డలు , కేజీ పంచదార, టీ పొడి పాకెట్, కూచిపూడి లో 100 మందికి , తొగరాయి లో 100 మందికి, రెండు గ్రామాలకు కలిపి మొత్తం 200 మంది వరద బాధితులకు దాదాపు మొత్తం 5 లక్షల రూపాయల సరుకులు అందజేయటం జరిగింది, ఈ సందర్బంగా రనబోతు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతాయి, ఇక్కడ ఈ మూలన ఉన్న కూచిపూడి , తొగరాయి గ్రామాలకు ఎవ్వరు సహాయ సహకారాలు అందించడం లేదని కొంతమంది మిత్రులు మాకు సమాచారం ఇవ్వగానే నల్లగొండ ఎన్ఆర్ఐ ఫోరం సహకారం తో మరియు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ వారితో కలసి కూచిపూడి గ్రామం, తొగరాయి గ్రామము లోనే వరద బాధితులకు పది రకాల నిత్యవసర సరుకులు , బియ్యం, దుప్పట్లు అందజేయడం జరిగింది, దీనిని స్ఫూర్తిగా తీసుకొని, ఇంకొన్ని సంస్థలు ముందుకొచ్చి బాధితులని ఆదుకుంటాయి అని ఆశిస్తున్నాముఆని, అట్లనే మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రీన్ క్లబ్ ట్రస్ట్ బృందానికి, సత్యనారాయణ రెడ్డి, జానకి రెడ్డి గారికి,హుజూర్ నగర్ అసెంబ్లీ గొంగరెడ్డి వెంకటరెడ్డి గారికి వారి మిత్రులు మామిడి వెంకటేశ్వర్లు గారు తొగరాయి గ్రామ వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు, రెండు గ్రామ యువకులకు , పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.అదే విధంగా గొంగరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం చేసినందుకు ఎన్నారై రణబోతు శ్రీనివాస్ అన్న కు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీనివాస్ అన్న గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని, అన్న గారి, వారి మంచి తనానికి, వారికి ఇలాంటి సామాజిక స్పృహకు, దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని, రణబోతు శ్రీనివాస్ అన్న లాంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదుగా ఉంటారని ,ఎక్కడైన ఆపద ఉంటే నేను ఉన్నాను అని సహాయ చెయ్యటం కోసం ముందుకు రావటం చాలా గొప్ప విషయం అని, శ్రీనివాస్ గారిది గొప్ప హృదయం ఆని,మరియు గ్రేటర్ నల్లగొండ ఎన్ఆర్ఐ ఫోరం బృందము కూతూరు శ్రీనివాసరెడ్డి గారికి , అమృతా రెడ్డి గారికి,శాంతి పుట్ట గారికి ,సుధీర్ రాజు గారికి ,ఇలాంటి కార్య్రమాలు చేస్తున్నదుకు వారి బృందానికి కృతజ్ఞతలు తెలియజేయటం జరిగినది , ఈకార్యక్రమంలో గ్రేటర్ నల్లగొండ NRI ఫోరం సభ్యులు సత్యనారాయణ రెడ్డి, జానకిరెడ్డి అమృతారెడ్డి, కూతురు శ్రీనివాస్ రెడ్డి ,శాంతి పుట్ట గారు, సుధీర్ రాజు , సురేష్ గారు , గ్రామ యువకులు, గ్రామ పెద్దలు,గ్రామస్తులు పొలుగొనారు