స్టేషన్ ఘనపూర్ మార్చి 02తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పుట్టినరోజు వేడుకలు స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మార్కెట్ కమిటీ చైర్మన్&నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు ఆధ్వర్యలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి,డైరెక్టర్లు బత్తుల రాజన్ బాబు,చల్లారపు శ్యామ్ సుందర్ రెడ్డి, చిగురు సరిత,ఆంజనేయులు మార్కెట్ సిబ్బంది,వ్యాపారులు,హామలీలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.