మిషన్ భగీరథ ఎండా కాలం సన్నద్ధత పై సమీక్ష సమావేశం
Uncategorizedమిషన్ భగీరథ ఎండా కాలం సన్నద్ధత పై సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో… రానున్న ఎండాకాలం నేపథ్యంలో నిరాటంకంగా నిర్వర్తించాల్సిన మంచినీటి సరఫరా పై మిషన్ భగీరథ అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ,
వేసవికాలంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా శుద్ధి చేసిన మంచినీరు అందిస్తాం
మిషన్ భగీరథ పథకం అనేది దేశంలో ఎక్కడా లేదు.
ప్రతి ఇంటింటికి నల్లాల ద్వారా తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
3 సంవత్సరాలలో మిషన్ భగీరథ పథకం పూర్తి చేసి మంచి నీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుంది.
వేసవికాలంలో కూడా మంచినీటి సరఫరా లో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాము.
రిజర్వాయర్ లలో నీటి నిలువలు తగ్గకుండా చూడాలి.
కరెంట్ సప్లై తోపాటు పైపు లైన్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి లీకేజీ లు రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించడం జరిగింది.
అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండి, సమన్వయంతో పని చేయాలి
అన్ని రిజర్వాయర్లు నిండి ఉండేలా ఇప్పుడే జాగ్రత్త పడండి
ఎండా కాలంలో కూడా నిర్దేశిత నీటిని ప్రజలకు నాణ్యంగా అందించాలి
కరెంటు సమస్యలు వచ్చినా, నీటి సరఫరా ఆగవద్దు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడండి
పంపుల మెయింటెనెన్స్ సరిగా చేయాలి. పైప్ లైన్ లీకేజీ లు లేకుండా జాగ్రత్త వహించాలి.
ఫిల్టర్ బెడ్లు, ట్యాంకుల క్లీనింగ్ సరిగా చేయాలి
అన్ని స్కూల్స్, అంగన్ వాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంచినీరు అందాలి
ఈ సారి ఎండలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, నీటి సరఫరా కు ఆటంకాలు లేకుండా, అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి
ఈ సమీక్ష సమావేశంలో ఈ ఎన్ సి, ce లు, ఈ ఈ లు, అన్ని జిల్లాల ఎస్ ఈ లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.