ములుగు జిల్లాలో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
Mulugu*కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు*ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ అని భారతదేశానికి నాడు స్వాతంత్రం నేడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు ఆశీర్వదించాలని అని దేశానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల కడుపు నింపిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీభారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ లౌకిక, ప్రజాస్వామ్య, న్యాయమైన మరియు సమగ్రమైన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తు, దేశ రక్షణలో తనవంతు బాధ్యతను నిర్వహిస్తూ 138 సంవత్సరాలుగా దేశ ప్రజలకు సేవను అందిస్తూ ప్రజా అభివృద్ధిని, శాంతిని ప్రోత్సహిస్తూ మన్ననలు పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సీతక్క గారు అన్నారుఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు మల్లాడి రాం రెడ్డికిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి తో పాటు సర్పంచులు ఎంపీటీసీలు,గ్రామ,మండల జిల్లా నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల జిల్లా మండల గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు