పాలకుర్తి మండలం లోని విష్ణుపురి గ్రామ పంచాయతీకి చెందిన సుంకరి శశివర్మ దర్శకత్వంలో తీస్తున్న నూతన మూవీకితెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.. ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే మూవీ చక్కగా రావాలని ఆకాంక్షిస్తూ క్లాప్ కొట్టి మూవీ షూటింగును ప్రారంభించారు. పాలకుర్తి ప్రాంతానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు సుంకరి శశి వర్మ దర్శకత్వంలో నూతన మూవీ తీయడం అభినందనీయమన్నారు శశివర్మ గొప్ప దర్శకుడుగా ఎదిగి మంచి మంచి సినిమాలు తీయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గువేరా ఫిలిమ్స్, ప్రొడక్షన్ నెంబర్ వన్ పతాకంపై తీసే నూతన మూవీ కి ఈ ప్రాంతానికి చెందిన సుంకరి శశివర్మ దర్శకత్వం వహిస్తుండగా హీరో హీరోయిన్లుగా డాక్టర్ విశ్వాస్-దివ్య దత్తాత్రేయ లు నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, కెమెరా మెన్ పవన్ గుంటుకు , నిర్మాత రాము నేతృత్వంలో 'గ్రామీణ ప్రాంతంలో జరిగే వాస్తవిక ప్రేమకథా చిత్రం` రూపుదిద్దుకోనుంది