మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన
Jangaonజనగామ జిల్లా పాలకుర్తి సమీపంలో వావిలాల క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మృతులు పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ నసీమా(50) మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామం టీక్యా తండాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు
హేమాని(54)
జాటోతు బుజ్జి(51) వీరు చనిపోయారు.దీంతో కుటుంబ సభ్యులు పలు సంఘాల నాయకులు జనగామ ఏరియా హాస్పిటల్ ఎదురుగా రోడ్డుపై బేటాయించి నిరసన వ్యక్తం చేశారు.చనిపోయిన వారికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా డబల్ బెడ్ రూమ్ ఇల్లు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సుమారు కిలోమీటర్ పొడవున వాహనాలు నిలువగా ఒకపక్క వానను కూడా లెక్కచేయకుండా ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో స్థానిక ఎస్సై శ్వేత వారికి సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతో కొద్దిసేపు పోలీసుల బాధితుల మధ్య వాగ్వివాదం జరిగింది.కలెక్టర్ రావాలని వారు డిమాండ్ చేయడంతో ఎస్సై శ్వేత కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడిన అనంతరం జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా అక్కడికి చేరుకొని వారి డిమాండ్లను ప్రభుత్వానికి వివరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.అనంతరం సామాజిక సేవకులు మహమ్మద్ యాకూబ్ పాషా మాట్లాడుతూ..ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని వారికి న్యాయం చేయాలని లేకుంటే తిరిగి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.