మైలాన్ పరిశ్రమ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
Uncategorized… .. డీసీఎల్ గారికి సీఐటీయు వినతి.. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ (డీసీఎల్) రవీందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే రాజయ్య మాట్లాడుతూ కాజీపల్లి లోని మైలాన్ పరిశ్రమ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, మైలాన్ పరిశ్రమలో ప్రమాదం జరిగి ముగ్గురు మరణించడం జరిగింది, ఈ మరణాలకు యజమాన్యమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు, యజమాన్యం తగిన చర్యలు తీసుకుపోవడం ఫలితంగానే ప్రమాదం జరిగిందని అన్నారు, అనుభవమైన కార్మికులను, అధికారులను నియమించకపోవడం వలన ప్రమాదం జరిగిందని అన్నారు, అలాగే విశాలమైన గది, వెలుతురు లేని గది వల్ల ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదం జరిగి ముగ్గురు ప్రాణాలు పోయిన ఒక రోజు కూడ సెలవు ప్రకటించలేక పోయిందని అన్నారు, దీనిబట్టే యజమాన్యం తప్పు అర్థమవుతుందని అన్నారు .కెమికల్ ను తగిన జాగ్రత్తలతో దాచాలని కానీ అటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు, మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించలేదని అన్నారు, వివిధ ప్లాంట్ లలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు, కార్మికులు మరణించిన కనీసం ఒక్క పూట కూడా బంద్ చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీధర్ రావు, పి ఎల్ గౌడ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అభివందనలతో.. కే రాజయ్య సిఐటియు…