హనుమకొండ: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు రన్నింగ్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడికి వెళుతున్న హనుమకొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి ,యువజన సంఘాల నాయకులను రాత్రికి, రాత్రి అక్రమ అరెస్టులు చేసి స్టేషన్ల లో నిర్బంధించడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి అన్నారు.ఉద్యమాలను చేసే వారిపై నిర్బంధాలు ప్రయోగించి అణచివేయాలనే చర్యలను ఉపసంహరించుకోవాలని, ఎంత అణిచివేయాలని చూస్తే అంతే ఉదృతంగా ఉద్యమాలు ఉంటాయని, రాష్ట్రంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలామంది నిరుద్యోగులు ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ లో అర్హత సాధించలేక పోయారని, ప్రభుత్వం కుట్రపురితంగా వ్యవహరించడం వల్లే అభ్యర్థులు నష్టపోయారని, తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపకుండా, హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్పులు కలపాలని హైకోర్టు ఆర్డర్‌ను అమలు చేయాలని రన్నింగ్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.