రజక వృత్తిదారులకు డబుల్ బెడ్రూంలు ఇవ్వాలి

◆ఆన్లైన్ లో అప్లై చేసుకున్న రజకులకు లక్ష రూపాయలు ఇవ్వాలి

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో 16-9-2023 శనివారం దౌల్తాబాద్ రజక సంఘం పట్టణ అధ్యక్షులు కిందిగేరి వెంకటప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం కోసం 250 యూనిట్ల ఉచిత విద్యుత్, దోబి వృత్తి కాంట్రాక్టు రజకులకే ,రజక ఆత్మగౌరవ భవనం ,141 మున్సిపాలిటీలకు ఆధునిక ధోబీ యంత్రాలను రజక కులస్తుల సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న మరో పథకం నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు నిజమైన రజక వృత్తిదారులకు ఇవ్వాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక అన్నారు .జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ అశోక్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో రజకు అన్ని రంగాల్లో వెనుకబడ్డారు కావున వికారాబాద్ జిల్లా రజక కులస్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశానికి వార్డు మెంబర్ పద్మమ్మ,జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ బాలప్ప ,కోడంగల్ ఇంచార్జ్ సి.మోహన్, సిహెచ్ బస్వరాజ్, దౌల్తాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గడ్డమీది వెంకటయ్య,గడ్డమీది బీమప్ప ,వెంకటమ్మ ,చిన్న పద్మమ్మ, పెద్ద మల్కమ్మ,సి.కృష్ణ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *