రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు -2 కార్యక్రమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేద్దాం
Jangaonగ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఆహ్వానించాలి
ప్రజా ప్రతినిధులు దగ్గరుండి, తమ కార్యక్రమంగా భావించి దీనిని విజయవంతం చేయాలి
కంటి వెలుగు -2 సమిక్ష సమావేశంలో మంత్రి దయాకర్ రావు గారు, కలెక్టర్ లింగయ్య గారు, ఎమ్మెల్యే రాజయ్య గారు,జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి గారు
ఈ రోజు జనగామ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణలో అంధత్వ నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటి వెలుగు – 2 కార్యక్రమం సమిక్ష సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య గారు, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారితో కలిసి హాజరైన జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పాగాల సంపత్ రెడ్డి గారు…..
సమావేశంలో వారు మాట్లాడుతూ….
ఈ కంటి వెలుగు మొదటి విడతలో విజయవంతంగా చేశాము.
గతంలో 4 లక్షల మందికి చేశాం.
ఈసారి 6 లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నాం.
జిల్లాలో 221 గ్రామాలు, 30 మున్సిపాలిటీలలో 26 టీమ్స్, 30 వైద్య అధికారులు పని చేస్తారు.
ఈ కార్యక్రమానికి ఎంత డబ్బు అయినా సీఎం కేసీఆర్ గారు ఖర్చు చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి దీనిని విజయవంతం చేయాలి.
రేపటి నుంచి మండల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో ఏ రోజుల్లో ఎక్కడ క్యాంప్ అనేది నిర్ణయించాలి.
ఈ సమావేశాలకు ఎమ్మెల్యే, జెడ్పీ, మండల స్థానిక సంస్థల ప్రతినిధులను పిలవండి.
ఎంపీపీలు ఈ సమావేశాన్ని సమన్వయము చేయాలి.
ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి.
వీరంతా 9 గంటలకే రావాలి.
ఆలస్యం అయితే ఎవరి కోసం వేచి చూడొద్దు..ప్రజలకు ఇబ్బంది రానివ్వవద్దు.
గ్రామ సభలు పెట్టాలి. కంటి వెలుగు పై అవగాహన కల్పించాలి.
గ్రామ పంచాయతీకి వెయ్యి రూపాయలు ఖర్చు కోసం ఇస్తున్నాం. సీఎం కేసీఆర్ గారు స్పెషల్ గా ఇస్తున్న నిధులు.
ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వెయ్యి రూపాయలు ఇస్తారు.
ఆఫీసర్ టీమ్స్ కు 1500 రూపాయలు ఇస్తున్నారు.
గ్రామంలో అన్ని వసతులు సర్పంచ్ లు, ఎంపీటీసీలు దగ్గరుండి కల్పించాలి.
అవసరం అయితే సర్పంచ్ లు, భోజనాలు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను.
ప్రజా ప్రతినిధులు దీనిని అవకాశంగా తీసుకోవాలి.
చాలామంది కంటి సమస్యలు ఉన్నా వెళ్ళలేక, తీసుకెళ్లే వారు లేక, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు.
సీఎం కేసీఆర్ గారు ఇది గుర్తించి ఇంటి వద్దే పరీక్షలు చేసి, అద్దాలు ఇస్తున్నారు.
ప్రారంభం నుంచి క్యాంప్ అయ్యే వరకు సర్పంచ్ అక్కడే ఉండి పర్యవేక్షించాలి. దీనిని తమ కార్యక్రమంగా భావించాలి. విజయవంతం చేయాలి.
గతంలో అధికారులు దగ్గర ఉండి విజయవంతం చేశారు…కానీ ఈసారి ప్రజా ప్రతినిధులు నాయకులు దగ్గరుండి విజయవంతం చేయాలి.
మన జిల్లాకు 7వేలు రీడింగ్ గ్లాసెస్ వచ్చాయి.
మిగిలిన వారికి పరీక్షలు చేసి 15 రోజుల్లో అద్దాలు ఇస్తారు. వీటిని కూడా సర్పంచ్ లు ఇంటింటికి వెళ్లి ఇచ్చి రావాలి.
ఏ ఊరి ప్రజలు ఆ ఊరిలోనే చేసుకుంటారు.
ప్రతి గ్రామ పంచాయతీలో, వార్డులో కంటి వెలుగు ఫ్లెక్సీలు పెట్టాలి.
ప్రతి రేషన్ డీలర్ దుకాణం వద్ద ఫ్లెక్సీ పెట్టాలి.
డప్పు చాటింపు చేయించాలి.
ఎంపీపీలు కూడా మండల పరిధిలోని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలి.
ప్రతి ఇంటికి సర్పంచ్ వార్డు మెంబర్లను తీసుకెళ్లి కంటి వెలుగు కార్యక్రమానికి రావాలని ఆహ్వానించాలి.
ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టాలి.
చిన్న రిమార్క్ రావొద్దు. కేసిఆర్ గారిని దేవుడిగా చూడాలి.
ఇది గిన్నిస్ బుక్ లో ఎక్కబోతుంది.
జనగామ జిల్లా నంబర్ వన్ రావాలి.
రేపు, ఎల్లుండి మండల సమావేశాలు పెట్టండి. అత్యవసర సమావేశం గా పెట్టండి.
కంటి వెలుగు క్యాంప్ ఉన్న రోజు ఉపాధి హామీ పథకం బంద్ చేయండి.
సమిష్టిగా దీనిని విజయవంతం చేయాలి.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణా రెడ్డి, రైతు కోఆర్డినేటర్ రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పొకల జమునా లింగయ్య,డీసీపీ సీతారాం, DRDO రాంరెడ్డి, DMHO మహేందర్ రెడ్డి, DPO& CPO వసంత, జెడ్పీటీసీలు, ఎంపిపిలు, కో-ఆప్షన్ సభ్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.