రాహుల్ గాంధీపై అనర్హత వేటు
Hanamkondaకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటును నిరసిస్తూ గాంధీభవన్, హైదరాబాద్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకకు నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన దీక్షకు తరలి వెళ్లి దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ..
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, అవినీతిని ఎవ్వరు ప్రశ్నించినా వారిపై, ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, అవనీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడం బిజేపి నాయకులకు కంటగింపు అయిందని అన్నారు. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అదాని సంస్థలకు మోడీ ఎలా దోచిపెట్టాడో రాహుల్ గాంధీ ప్రజలకు వివిరించారు. దీనిపై ప్రశ్నించినందుకే కేంద్ర పాలకులు ఆయనపై పగబట్టి లోక్ సభ సభ్యత్వాన్ని రాదు చేయించారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాని యావత్తు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు