మండలం లో సోమవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో డ్వాక్రామహిళలతో సమావేశంఏర్పాటుచేసారు యలమంచిలి సీతారామయ్య భవన్ లో పూనేం కనకదుర్గ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు డి. సీత హమాలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఏ విధంగా అయితే బ్యాంకు రుణాలు మాఫీ చేశారో అదేవిధంగా మా డ్వాక్రా మహిళలు ఉన్న బ్యాంకు రుణాలు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, అదేవిధంగా ఇంటి స్థలాలు లేని వారికి వెంటనే ఇంటి స్థలాలు కేటాయించి ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇవ్వాలని ఆమె ప్రతి ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 12వ తేదీన జరిగే అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు ఎన్. లీలావతి, మచ్చా రామదేవి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి గౌతమి, ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ మిడియం జయ, మడివి విజయలక్ష్మి, శ్వేత, అలివేలి, మడకం లక్ష్మి, కొమరం భద్రమ్మ, నాగమణి, సోయం సావిత్రి, సోంది కమల, సుభద్ర, జ్యోతి, సంధ్య, సుశీల, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు