ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టు లు భర్తీ చేయాలి సిపిఐ మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకులు సాయన్న భద్రాచలం: దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం గ్రామ కాపురస్తుడు కొరశ రామచెట్టి కుడి కాళ్లు రాడ్లు ఉన్నాయని ఆపరేషన్ చేయించుకునేందుకు ఈనెల 18వ తేదీన జాయిన్ అవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ అప్రోలు వచ్చాయి ఏడు రోజులు కావస్తున్న ఎముకలు డాక్టరు ఈరోజు వెళ్లి అడగగా ఇంకా రెండు రోజుల తర్వాత చేస్తానని చెబుతున్నాడు. అప్పటికి తొమ్మిది రోజులు అవుతుంది ఇటువంటి నిర్లక్ష్యం చేయడం వల్ల పేషెంట్లను పక్కదారి పాటించడమేనని ఇటువంటి నిర్లక్ష్యం చేసే డాక్టర్లని భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో ఉంచొద్దని అన్నారు గతంలో భద్రాచలం ఐటిడిఏ పిఓ కి ఆస్పత్రికి సంబంధించిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది దాంట్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని అందుబాటులో లేని డాక్టర్లని ట్రాన్స్ఫర్ చేయాలని డాక్టర్లున్న రూముల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇటువంటి నిర్లక్ష్యం చేసే డాక్టర్లని సస్పెండ్ చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ భద్రాచలం డివిజన్ నాయకులు సాయన్న డిమాండ్ చేశారు.