పాలకుర్తి మండలం వావిలాల గ్రామ సబ్ స్టేషన్ మూల మలుపు వద్ద లారీ బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందడం జరిగింది పలువురు తీవ్రంగా గాయపడినారు ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి ప్రమాద విషయం తెలుసుకొని మృతుల కుటుంబాలను పరామర్శించడం జరిగినది తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించినారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు ఆసుపత్రిలో అందుబాటులో లేని వైద్యులపై అగ్రహం వ్యక్తం చేశారు విధులకు గైరాజరైన వైద్యాధికారులను సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషను ఆదేశించారు