లక్ష్మారెడ్డి పల్లిలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం

గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ ఒద్దుల విజయ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం గ్రామస్థులు ఘనంగా జరుపుకున్నారు.పవిత్ర శ్రావణమాసం పురస్కరించుకుని బుధవారం పోచమ్మ తల్లికి బోనాలతో మొక్కులు సమర్పించుకున్నారు.ఎంతో నియమ నిష్ఠలతో మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారిని పూజించారు.

డప్పు వాయిద్యాల నడుమ,శివ సత్తుల పునకాలతో గ్రామ వీధులలో ఊరేగింపుగా బోనాలు నెత్తిన ఎత్తుకుని పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పోచమ్మ తల్లి దగ్గరికి చేరి వైభవంగా వేడుక నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లి ని కోరుతూ కోళ్లు,పొట్టేలను అమ్మవారికి బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *