*కోదాడ , గళం న్యూస్ ప్రతినిధి:కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. 2007 జనవరి 6న ఆనాడు మేజర్ గ్రామపంచాయతీ గా ఉన్న కోదాడ 20 వార్డుల్లోని లబ్ధిదారులందరికీ 56 ఎకరాల విస్తీర్ణంలో 1431 ఇండ్ల స్థలాలు కేటాయించారు. ఇందులో దాదాపుగా 1000 ఇండ్లు పూర్తి అయి మిగతావి వివిధ దశలలో నిర్మాణాలు ఆగిపోయాయి ఇంటి బిల్లులు రాక స్తోమత లేక ఇతరత్రా కారణాలతో నిలిచిపోయాయి 2011లో మున్సిపాలిటీగా మారిన ప్రత్యేక వార్డుగా మారిన కాలనీలో మౌలిక సదుపాయాలైన రోడ్లు మురుగునీరు కాలువలు సరైన త్రాగునీరు లేక దోమలు క్రిమి కీటకాల బెడదతో తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి నెలకొంది,విధిలేని పరిస్థితిలో ఆనాడు ధర్నాలు దీక్షలు ఆమరణ నిరాహార దీక్షలు సైతం చేయగా కొందరికి ఇంటి పన్నులు మాత్రమే విధించారు ఇంటి పట్టాలు సైతం నేటికీ ఇవ్వలేదు.కాలనీ ఇచ్చి 17 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు వచ్చి మారిన కాలనీలో మౌలిక వసతులకు ఇకనైనా అధిక మొత్తంలో నిధులు కేటాయించి ఎమ్మెల్యే,మంత్రి లకు సయ్యద్ బషీరుద్దీన్ సామాజిక ఉద్యమకర్త విజ్ఞప్తి చేసారు .