లజ్నాఇమాయిల్లాహ్ శతాబ్ది జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలి*
Uncategorized*ఈ69 న్యూస్ వరంగల్ జనవరి 11అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా(లజ్నాఇమాయిల్లాహ్) విభాగం శతాబ్ది జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా(లజ్నాఇమాయిల్లాహ్)అధ్యక్షురాలు బుష్రా నిసార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం జమాత్ మహిళా విభాగం ఏర్పాటై వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం జమాత్ 5వ ఉత్తరాదికారి(ఖలీఫా)హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ అయ్యదహుల్లాహు తాలా బినస్రిహిల్ అజీజ్ అనుమతితో ఈ నెల 15వ తేదీన యావత్ ప్రపంచంలో శతాబ్ది జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.అహ్మదీయ మహిళా విభాగాన్ని జమాత్ అంతర్గత,ధార్మిక, సామాజిక అభివృద్ధి కోసం హజ్రత్ మిర్జా బషీరుద్దీన్ మహమూద్ అహ్మద్ (ర.అ)25 డిసెంబర్1922 సంవత్సరములో లజ్నాఇమాయిల్లాహ్ విభాగం ను ఏర్పాటు చేశారని అన్నారు.అహ్మదీయ ముస్లిం జమాత్ మహిళా(లజ్నాఇమాయిల్లాహ్) విభాగం ఆధ్వర్యంలో ప్రస్తుత 5వ ఖలీఫా (ఉత్తరాదికారి)హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ అయ్యదహుల్లాహు తాలా బినస్రిహిల్ అజీజ్ సంరక్షణలో 215దేశాలకు పైగా దేశాలలో ధార్మిక,సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయ ముస్లిం మహిళలు శతాబ్ది జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు.